హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సహాయ నిరాకరణ, 13నుండి ఆందోళనలు: జెఏసి చైర్మన్ కోదండరామ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ శుక్రవారం అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సహాయ నిరాకరణ, ఆందోళన కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. ఈనెల 13 నుండి 22 వరకు ఈ సందర్భంగా ఆందోళన కార్యక్రమాల వివరాను ఆయన చెప్పారు. ఈనెల 13వ తారీఖున అన్ని గ్రామాల్లో చాటింపులు వేయిస్తామని చెప్పారు.

ఆ తర్వాత 15న జైల్ భరో నిర్వహిస్తామన్నారు. 16న ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తామన్నారు. 19న రాస్తారోకోలు, 20న ఎన్‌హెచ్-9 రహదారీని దిగ్బంధం చేస్తామని చెప్పారు. 22 నుండి జెఏసి బంద్ ఉంటుందని చెప్పారు. సహాయ నిరాకరణలో కార్యక్రమాలలో ప్రజలందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సహాయ నిరాకరణలో భాగంగా బస్సులో టిక్కెట్లు తీసుకోక పోవడం, టోల్ గేట్లు, ఇంటి పన్నులు చెల్లించక పోవడం, జనాభా లెక్కలను బహిష్కరించడం తదితర కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.

English summary
Telangana Political JAC decided to organize agitations till Telangana bill is proposed in Parliament. JAC chairman Kodandaram said agitations will be organized from 13th to 22nd February. He called upon Telangana people to participate in civil disobedience movement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X