రోజా పవర్ ప్యాక్డ్ పంచ్ లు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..పై వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్ కే రోజా ఘాటు విమర్శలు చేశారు. ఉగాది పర్వదినాన చంద్రబాబు ఇచ్చిన హామీలు, చేసిన ప్రకటనలను తప్పుపట్టారు. కూటమి ప్రభుత్వానికి చురకలు అంటించారు.

ఉగాది ప‌ర్వ‌దినం నాడు సీఎం చంద్ర‌బాబు చెప్పినవన్నీ అబ‌ద్ధాల‌ేనని రోజా మండిప‌డ్డారు. పండగ పూట కూడా రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆమె అన్నారు. శుక్ర‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. చంద్ర‌బాబు ఉగాది రోజున ప్రజలు సంతోషంగా ఉన్నార‌ని చెప్పడం పూర్తిగా అసత్యమని, పాచిమాటలు మాట్లాడారని విమర్శించారు.

Roja YSRCP leader and Former Minister made key remarks against the Andhra Governement over Several Issues

ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు, మేనిఫెస్టోలోని 145 వాగ్దానాలు అమలు కాలేదని రోజా ఆరోపించారు. 18 ఏళ్లు దాటిన మహిళలకు నెల‌కు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి మాట తప్పారని, ఈ పథకం అమలు చేయలేదని అన్నారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదని, నిరుద్యోగులకు 3,000 రూపాయల భృతి ఇస్తానని వాగ్దానం చేసి మోసం చేశారని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎలా సంతోషంగా ఉంటారని ప్రశ్నించారు.

వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాలనలో పేదలు, ఉద్యోగులు, రైతులు సంతోషంగా ఉన్నారని రోజా గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రైతులు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాతన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పటికీ, ఉగాది సందర్భంగా ప్రజలకు కనీసం శుభాకాంక్షలు కూడా తెలియజేయలేదని త‌ప్పుప‌ట్టారు. అర్హతలేని వారికి పదవులు ఇస్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఖరిపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆమె డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+