ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..

హారర్ మూవీస్ అనగానే మనకు మలయాళం, తమిళ్ సినిమాలే గుర్తుకువస్తాయి. మలయాళం సినిమాల్లో ఎక్కువ శాతం హారర్, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఉంటాయి. అటు తమిళంలోనూ థ్రిల్లర్ మూవీస్ చాలానే వచ్చాయి. అయితే రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన ఓ హారర్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ క్రమంలో త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది.


తమిళంలో సైకలాజికల్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మూవీ ఫోర్త్ ఫ్లోర్.. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీ ఫిబ్రవరి 27న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఉగాది కానుకగా ఈ మూవీ మార్చి 20 న స్ట్రీమింగ్ కానుంది.

ఈ మూవీకి సుందరపాండి దర్శకత్వం వహించారు. రాజా నిర్మించారు. ఈ మూవీలో ఆరి అర్జునన్, దీప్సిక, పవిత్ర, అలాగే తలైవాసల్ విజయ్, సుబ్రమణియన్ శివ, ఆదిత్య కథిర్,బేబీ శ్రీవర్షిణి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 20 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది ఈ మూవీ. ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన చేశారు. ఈ మూవీకి ధరణ్ కుమార్ సంగీతం అందించారు.

TheFourthFloor Horror Thriller movie Starts Streaming on Sun NXT from March 20 The Fourth Floor

ఇక ఫోర్త్ ఫ్లోర్ కథ విషయానికి వస్తే.. ఓ రోజు ధీరన్ కు అనూ ఫోన్ చేస్తుంది. తనను కలుసుకోవడానికి రావాలని చెబుతుంది. అప్పటికే ఆమెతో ప్రేమలో ఉన్న ధీరన్ చెన్నైకు వెళ్తాడు. అనూ చెప్పిన సమయానికి కలవకపోవడంతో.. అక్కడే ఓ అపార్ట్ మెంటులోని ఫోర్త్ ఫ్లోర్ లో దిగుతాడు.. అయితే అప్పటినుంచి అతడికి విచిత్రమైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. దానికి గల కారణాలు ఏంటి..? అన్నదే మూవీ స్టోరీ లైన్..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+