కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే!

పరాభవ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఈ సంవత్సరమైనా కుంభరాశి జాతకులు శని బాధల నుండి విముక్తి పొందుతారా? వంటి వివరాలను నేడు తెలుసుకుందాం? కుంభ రాశి వారికి గ్రహ సంచారాలతో మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి.

కుంభరాశి వారి ఆదాయ వ్యయాలిలా

ఈ సంవత్సరం కుంభ రాశి వారి ఆదాయం 2, వ్యయం 8; రాజపూజ్యం 4, అవమానం 2గా ఉంటుంది. ఏలినాటి శని చివరి దశతో పాటు గురువు, శనీశ్వరుడు, రాహు-కేతువుల స్థాన ప్రభావం ఫలితాలపై ఉంటుంది. ఈ సంవత్సరం కుంభరాశి వారు కొన్ని విషయాల్లో శుభాలను, కొన్ని విషయాలలో అశుభాలను చూస్తారు.

Aquarius natives in 2026 will experience mixed results this is the complete horoscope of aquarius

ఆర్థిక స్థితి

ఆర్థికంగా ఆదాయం తక్కువైనా, కుంభరాశి వారికి డబ్బు అవసరాలకు సర్దుబాటు అవుతుంది. ఆకస్మిక ఖర్చులు అధికం కావచ్చు . కుటుంబం, పిల్లల ఫీజులు, ఆరోగ్య అవసరాలు కాస్త ఇబ్బంది పెడతాయి. అధిక వడ్డీలకు అప్పులు తీసుకోకుండా జాగ్రత్తపడాలి. దూరదృష్టితో ఆలోచించి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని సందర్భాలలో కుంభరాశి వారికి ఊహించని ధన లాభాలు ఉంటాయి. ఆ డబ్బులు పొదుపు పథకాలలోనూ, భూముల పైన పెట్టుబడులుగా పెడితే ఫలితం వస్తుంది.

ఉద్యోగస్తులకు

ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం పని ఒత్తిడి, అదనపు బాధ్యతలు అధికమవుతాయి. పదోన్నతుల్లేకపోయినా పనిభారం చాలా అధికంగా కనిపిస్తుంది. ప్రైవేటు రంగంలోనివారు ఉద్యోగాలు మారాలని ఆలోచించవచ్చు. అయినా అనవసర విషయాలకు దూరంగా ఉండి, పనిపై శ్రద్ధ పెడితే జూన్ వరకు అనుకూలత వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ కుంభ రాశి వారికి పీఆర్, మీడియా, సినీ రంగాల్లో లభించే గుర్తింపు భవిష్యత్తు అవకాశాలకు మార్గం సుగమం చేస్తుంది.

వ్యాపారులకు

వ్యాపారులకు ఈ ఏడాది చాలా ఇబ్బందికర, కఠిన పరిస్థితులుంటాయి. పోటీ తీవ్రమై, ఊహించిన లాభాలు రాకపోవచ్చు. అనుకోని ఖర్చులు అధికమవుతాయి. కుంభరాశి లోని వ్యవసాయదారులు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోవచ్చు. కొత్త పెట్టుబడులకు ఆచితూచి, పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. ఈవెంట్లు, స్టూడియోలు నిర్వహించే వారికి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

విద్యార్థులకు

కుంభరాశి లోని విద్యార్థులకు ఈ సంవత్సరం శుభ ఫలితాలు ఉంటాయి. ఉన్నత విద్యను ఆశించాలి అనుకునే వారికి చక్కని అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారి కష్టపడి చదివితే విజయాలను సాధిస్తారు. విదేశాలలో చదువుకోవాలి అనుకునే వారికి కూడా కలిసి వస్తుంది. అయితే విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు మధ్యవర్తుల విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం.

కుటుంబ జీవితం

కుంభ రాశి వారి కుటుంబ జీవితం సానుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ సోదరులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో చిక్కులు వచ్చే అవకాశం ఉంది. కుంభ రాశి వారు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముందస్తు పరీక్షలు చేయించుకొని వైద్య సలహాలు తీసుకోవాలి. సరైన విశ్రాంతి, నిద్ర, ఆహారం పైన దృష్టి పెట్టడం అవసరం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+