రంగంలోకి దిగిన తమ్ముడు పవన్ కళ్యాణ్, ఫ్యాన్స్‌తో భేటీ

Pawan Kalyan
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయబోతున్న నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం అభిమానులతో సమావేశమవుతున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తున్న వార్తను జీర్ణించుకోలేకపోతున్న అభిమానులకు సర్ది చెప్పడానికి పవన్ కళ్యాణ్ ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో పవన్ కళ్యాణ్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇంత కాలం పార్టీ వ్యవహారాలకు దూరంగా పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా రంగంలోకి దిగడానికి అన్నయ్యకు ఇబ్బంది కలగకుండా చూడాలనేదే అని అంటున్నారు.

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి దారి తీసిన పరిస్థితిని పవన్ కళ్యాణ్ అభిమానులకు వివరించే అవకాశం ఉంది. విలీనంతో అసంతృప్తికి గురైన అభిమానులు ఇతర పార్టీల వైపు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌ వైపు వారు దృష్టి పెట్టవచ్చు. దీంతో కాంగ్రెసులోనూ తగిన ప్రాధాన్యం ఉంటుందని, అన్నయ్య వెంటే ఉండాలని పవన్ కళ్యాణ్ అభిమానులకు చెప్పే అవకాశం ఉంది. అభిమానులు జారిపోకుండా చూడాలనేదే పవన్ కళ్యాణ్ ప్రధాన ఉద్దేశ్యమని చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ చిరంజీవితో సమావేశమవుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+