రాజమండ్రిలో ఈ నెల 28వ తేదీన చిరంజీవి సభ, నాగబాబు హాజరు

ఇటీవల చిరంజీవి హైదరాబాదులో అభిమానులతో సమావేశమైన విషయం తెలిసిందే. వివిధ వర్గాలతో చిరంజీవి విలీనంపై చర్చలు జరుపుతున్నారు. తాజాగా శనివారం చిరంజీవి కాపునాడు నాయకులతో హైదరాబాదులో చర్చలు జరిపారు. విలీనానికి కనీసం 45 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని చిరంజీవి ఈ మధ్య కాలంలో చెప్పారు. శానససభా సమావేశాలు ముగిసిన తర్వాతనే విలీన ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీ శాసనసభా పక్ష నేతగా చిరంజీవి ఈ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications