నెల్లూరు: ఓ కారు అదుపుతప్పి కాలువలోకి బోల్తా కొట్టడంతో నలుగురు మృతి చెందిన సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోని వాకాడు మండలం కల్లూరు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు చనిపోగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే మృతులంతా సంతపేటకు చెందిన వారిగా తెలుస్తోంది. కారు అదుపు తప్పి పక్కనున్న కాలువలోకి పడిపోవడంతో అందులో ఉన్న వారికి తప్పించుకునే వీలు లేక పోవడంతో మృతి చెందినట్లుగా తెలుస్తోంది.
Four people dead with a car accident in Sri Potti Sriramulu Nellore distict on today. Car jumped in to a canal on this
morings. In this accident four people dead and two injured. The accident took place around morinig at Kallooru village
of SPS Nellore district.