ఎస్సీ వర్గీకరణకు ప్రధాని మన్మోహన్ హామీ ఇచ్చారు: అఖిలపక్షం

ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షం సమావేశానికి రాని పార్టీలకు ఈ సమస్యపై అవగాహన లేదన్నారు. ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం అని సీనియర్ నాయకుడు నంది ఎల్లయ్య అన్నారు. ఉషామెహ్రా కమిషన్ వేసి మూడు సంవత్సరాలు అవుతుందన్నారు. అఖిలపక్షానికి సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి రాకపోవడం ఎమ్మార్పీఎస్ తప్పుబట్టడాన్ని ఆయన ఖండించారు. గతంలో దివంగత వైఎస్ సైతం అఖిలపక్షానికి రాలేదని గుర్తు చేశారు. ప్రధాని సానుకూలంగా స్పందించినట్టు టిఆర్ఎస్ నేత వినోద్ కుమార్ చెప్పారు. అసెంబ్లీ తీర్మానానికి అనుగుణంగా నడుచుకోవాలని వారు ప్రధానిని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications