చిరు సొంత న్యాయం, వైయస్ అవినీతి వారసుడు జగన్: చంద్రబాబు

వైయస్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి సంచుల కొద్దీ డబ్బుల మూటలు పంపించారన్నారు. వైయస్ రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఆరోపించారు. వైయస్ అవినీతికి మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వారసుడన్నారు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఉంటే పార్టీ పెట్టే వాడు కాదని చెప్పారు. జలయజ్ఞం పేరుతో 60వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆరు ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదన్నారు. వైయస్‌తో సహా ఆయన అనుచరులు చాలా నిధులు అంతా మింగారన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే నగదు బదిలీ పథకం అమలు చేస్తామన్నారు.
రైతులను, చేనేత కార్మికులను నిర్లక్ష్యం చేస్తే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు. ప్రభుత్వానికి పాలించడం చేతకాకుండే తప్పుకోవాలని సూచించారు. రైతుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని చెప్పారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారిందన్నారు. ప్రలను మోసం చేస్తే క్షమించమని చెప్పారు. రాష్ట్రంలో పనికి మాలిన ప్రభుత్వం ఉందని ఆరోపించారు. వైయస్ కుటుంబం వల్ల కడప జిల్లాలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే టిడిపి ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications