బాబాయ్, అబ్బాయిలకు ప్రజలే బుద్ధి చెప్తారు: చంద్రబాబు ధ్వజం

దేశంలో, రాష్ట్రంలో సంపదను కొన్ని కుటుంబాలే దోచుకుంటున్నాయని బాబు విమర్శించారు. సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు అంకాలమ్మ గూడూరులో రోడ్ షో నిర్వహించారు. చిత్రావతి-లింగాల ప్రాజెక్టు పనులకోసం వైఎస్ వెయ్యి కోట్ల రూపాయల ఖర్చుపెట్టారు తప్ప ఒక్క ఎకరాకు నీరివ్వలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ చితికిపోతున్నది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
మరోవైపు నిత్యావసర ధరలు పెరుగుతున్నా పేదవాడి ఆదాయం మాత్రం పెరగడంలేదని చంద్రబాబు తెలిపారు. ధరలను అదుపుచేయలేని ఈ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు. సూక్ష్మ రుణ సంస్థలకు ఎవరూ రుణాలు కట్టవద్దని, మీకు అండగా టీడీపీ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. సామాజిక న్యాయం అంటూ, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయినా, అందులో చిరంజీవి ఏమీ సాధించలేరని బాబు విమర్శించారు. కాగా పులివెందులలో బహిరంగ సభ నిర్వహించడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బాబు వారిపై మండిపడ్డారు. జిల్లా ఆయన పర్యటన రెండు రోజులపాటు సాగుతుంది.












Click it and Unblock the Notifications