కేశవరావుతో భేటీ: తెలంగాణపై కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఫలితం సాధిస్తారా?

తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని తాము పార్టీ అధిష్టానం నేతలను కలిసి కోరుతామని వారు చెప్పారు. తాము కాళ్లు పట్టుకునైనా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించాలని కోరుతామని వారు చెప్పారు. డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటనకు కట్టుబడి తెలంగాణ ఇవ్వాలని కోరుతామని వారు చెప్పారు. తెలంగాణ ఇస్తామనో, ఇవ్వమనో ఏదో ఒకటి స్పష్టంగా చెప్పాలని శాసనసభ్యుడు ముత్యం రెడ్డి అన్నారు.
అయితే, తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణపై తమ అధిష్టానంపై ఏ మేరకు ఒత్తిడి పెడతారనేది చెప్పలేని స్థితి. వారు అధిష్టానానికి చెందిన ప్రణబ్ ముఖర్జీతో పాటు ఇతర నేతలతో కూడా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. అధ్యక్షురాలు సోనియా గాంధీతో కూడా సమావేశం కావాలని వారు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications