వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చిరంజీవికి గుడ్ బై, వైయస్ జగన్ వెంట జ్యోతుల నెహ్రూ

జగన్ పార్టీని జిల్లాలో పటిష్టపరిచేందుకు తనతో పాటు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు రానున్నట్టు చెప్పారు. తమ నాయకుని ఆదేశాల మేరకు జ్యోతులను తమ వర్గంలోకి ఆహ్వానించినట్టు పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. జ్యోతుల రాకతో మెట్ట ప్రాంతంతో పాటు జిల్లాలో జగన్ పార్టీ పటిష్టమవుతుందని ధీమా వ్యక్తంచేశారు. జగన్‌తో చర్చించిన తర్వాత జగ్గంపేటలో ఎప్పుడు బహిరంగ సభ నిర్వహించేదీ ప్రకటిస్తామని వెల్లడించారు. యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ప్రత్తిపాడు ఎంపీపీ వరుపుల రాజా, అడ్డతీగల ఎంపీపీ అనంత ఉదయ భాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
జ్యోతుల నెహ్రూ పిల్లి సుభాష్ చంద్రబోస్ వైయస్ జగన్ కాకినాడ jyothula nehru pilli subhash chandra bose ys jagan Kakinada
English summary
Prajarajyam Party East Godavari district president Jyothula Nehru decided to distance away from Chiranjeevi. He announced in presence of ex minister Pilli Subhash Chandra Bose that he will support YS Jagan.
Story first published: Monday, February 14, 2011, 10:27 [IST]