ప్రభుత్వం పూర్తిగా దివాళా తీసింది: టిడిపి నేత కోడెల శివప్రసాద్
Districts
oi-Srinivas G
By Srinivas
గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం దివాళా తీసిందని మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ సోమవారం అన్నారు. ప్రభుత్వం పూర్తిగా మద్యంపైనే బతుకు వెళ్లదీస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం 2004లో 48వేల కోట్ల అప్పు ఉండేదన్నారు. అయితే 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1.54 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. ప్రభుత్వం బడాయి బడ్జెట్ ప్రవేశ పెట్టి ప్రజలను మభ్య పెడుతుందన్నారు. ప్రభుత్వం అలాంటి బడ్జెట్ మానుకొని ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసమంటూ తెలంగాణ ఐక్య కార్యచరణ సమితి చేస్తున్న సహాయ నిరాకరణ వల్ల రోజుకు ప్రభుత్వానికి 700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సరికావన్నారు.
Ex Minister, TDP senior leader Kodela Sivaprasad said that government is in financial crisis. He said state government has 1.54 lacks crores loan, but 48 thousand crores in 2004. He condemns Non Co-Operation Movement in Telangana.