ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేలు సోనియాతో భేటీ?

Congress
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ కోసం తెలంగాణకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు సోమవారం దేశ రాజధాని న్యూఢిల్లీ బయలు దేరి వెళ్లారు. తెలంగాణపై కేంద్రం గత డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని వారు కేంద్రాన్ని కోరే అవకాశం ఉంది. తెలంగాణలోగానీ, సీమాంధ్రలోగాని కాంగ్రెసు క్యాడర్ పెరగాలంటే ప్రత్యేక తెలంగాణపై వెంటనే నిర్ణయం ప్రకటించాలని వారు అధిష్టానాన్ని అడిగే అవకాశం ఉంది. వారు కేంద్ర మంత్రులతో పాటు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసే అవకాశం ఉంది.

గండ్ర వెంకటరమణారెడ్డి, కవిత, కుంజా సత్యవతి, ముత్యం రెడ్డి, టి రాజయ్య, కె లక్ష్మారెడ్డి, కిష్టారెడ్డి, ప్రతాప్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సత్యనారాయణ, చిరుముర్తి లింగయ్య తదితరులు ఢిల్లీకి వెళ్లిన వారిలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+