టిడిపి, కాంగ్రెసు కుమ్మక్కయ్యాయి: ధ్వజమెత్తిన వైయస్ జగన్

ప్రతి పేద విద్యార్థీ ఉచితంగా పెద్ద చదువులు చదువుకోవాలని ఎన్నో కలలుగన్న వైఎస్ ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని ప్రారంభించారని, మహానేత మరణించాక ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా విస్మరించిందని ఆయన అన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయింపులు చూపించినా..ఒక్క రూపాయీ విడుదల చేయలేదని అధికారులు చెబుతుంటే తనకు చాలా బాధనిపించిందని ఆయన అన్నారు. ప్రతి అక్కా, చెల్లీ లక్షాధికారులు కావాలని దివంగత రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పావలా వడ్డీకి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అధికారులు చెబుతుంటే వైఎస్ కలలుగన్న మరో ప్రపంచం ఏమైపోతుందా అని నాకు చాలా చాలా బాధనిపించిందని ఆయన అన్నారు. ఉన్న పథకాలకు నిధులివ్వట్లేదు సరికదా రచ్చబండ అని ఓ కార్యక్రమం పెట్టి ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications