కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి సినిమా అయిపోయింది, ఆయన గురించి ఎందుకు: చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
కడప: చిరంజీవి తన సొంత సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీలో తన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మంగళవారం అన్నారు. కడప జిల్లాలో రైతు కోసం యాత్ర రెండో రోజులో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం తీసుకు వస్తానని పార్టీని పెట్టిన చిరంజీవి సామాజిక న్యాయం సాధించాడని, ఇక తన సామాజిక న్యాయం కోసమే అవినీతి కాంగ్రెస్ వైపు వెళ్లారన్నారు. చిరంజీవి సినిమా అయిపోయిందని చెప్పారు. ప్రజలు అమాయకులు కారని, అందరినీ వారు గమనిస్తున్నారన్నారు. దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి అవినీతి అక్రమాలతో కోట్లాది రూపాయలు సంపాదించారన్నారు. టిడిపి అందరి అవినీతి, అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తుందన్నారు.

దేశంలో కూడా అవినీతిపై చైతన్యం వస్తుందన్నారు. ప్రజలంతా ఏకమై ఉద్యమిస్తే అవినీతిపరులు కోట్టుకు పోతారన్నారు. టిడిపి కార్యకర్తలపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని ఆరోపించారు. గతంలో వైయస్ కూడా టిడిపి నేతలపై అక్రమ కేసులు పెట్టి బెదిరించాలని చూశారన్నారు. టిడిపి 17 సంవత్సరాలు అధికారంలో ఉందని, కానీ అవినీతికి మాత్రం దూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రజల ఆస్తులను కాపాడాటానికి పోరాడితే కూడా కేసులు పెడతారన్నారు. కడప ఉప ఎన్నికలలో టిడిపి విజయం సాధిస్తుందన్నారు. అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తామని చెప్పారు. మాజీ ఎంపీ జగన్ అనుచరులు మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందుతుడి భానుకిరణ్‌తో సంబంధాలు పెట్టుకొని కడప జిల్లాను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు.

English summary
Megastar Chiranjeevi cinema was completed, so we do not need to talk about him, Said TDP president Chandrababu Naidu today in Kadapa district Rythu Kosam Yatra. He also blamed YS Rajasekhar Reddy, former chief Minister for booking illegal cases against his opponents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X