వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేం పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం: మన్మోహన్ సింగ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: ప్రభుత్వం అన్ని విషయాల్లో పారదర్సకంగా వ్యవహరిస్తోందని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. తాము సజావుగా పరిపాలన సాగిస్తున్నామని, బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. టీవీ లైవ్‌లో వివిధ చానెళ్ల సంపాదకులు ప్రశ్నలు అడగడానికి ముందు ఆయన బుధవారం కొంత మాట్లాడారు. ప్రభుత్వం అన్ని సమస్యలను సమర్థంగా ఎదుర్కుంటోందని ఆయన చెప్పారు. ధరల పెరుగుదలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. పార్లమెంటు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఆర్థిక మాంద్యాన్ని తట్టుకుని ఈ ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం వృద్ధిరేటు సాధించడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. పలు విషయాల్లో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని ఆయన చెప్పారు. ద్రవ్యోల్బణం అభివృద్ధికి ఆటంకంగా మారిందని, దాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని, ఈ ఏడాది అంతానికి ఫలితం సాధించగలమని ఆయన చెప్పారు. ధరల పెరుగుదలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.

జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని, ఆ రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితులు చక్కబడుతున్నాయని ఆయన అన్నారు. భారతదేశంలో పరిస్థితులు చక్కబడుతున్నాయని ఆయన అన్నారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపైనే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి.

English summary
Prime Minister Manmohan Singh claimed his government is transparent in all aspects. He urged opposition to allow Parliament session to run smoothly. He answered the questions posed by media in TV Live show.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X