ఏ కమిటీ ముందైనా హాజరవుతా, భయపడడం లేదు: ప్రధాని

ముందొచ్చినవారికి ముందు కేటాయింపులు అనే విధానం తనకు తెలియదని ఆయన అన్నారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో అన్ని కోణాల్లో తనకు వివరణ ఇవ్వాలని తాను 2007 నవంబర్ 2వ తేదీన తాను రాజాకు లేఖ రాసినట్లు, స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో ఏ విధమైన అవకతవకలు జరగలేదని రాజా జవాబు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ట్రాయ్, టెలికం శాఖ, ఆర్థిక శాఖ అనుమతుల తర్వాతనే 2జి స్పెక్ట్రమ్ వేలాలు జరిగాయని ఆయన చెప్పారు. తాను పిఎసి ముందు హాజరవుతానని ఇప్పటికే బహిరంగంగా చెప్పానని, ఏ కమిటీ ముందైనా హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. ఎస్ బ్యాండ్ కుంభకోణంపై సమయానుకూలంగా సరైన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. యాంత్రిక్స్, దేవాస్ ఒప్పందంపై అన్ని ప్రభుత్వ విభాగాల్లో చర్చలు దాదాపుగా పూర్తయ్యాయని, దేశ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications