వైయస్ జగన్ వెంట వెళ్లేవారి జాబితా పంపాలని డిఎస్‌ను అడిగిన మొయిలీ

పీసీసీలో కీలక పదవిలో ఉంటూనే జగన్ శిబిరం తరఫున ప్రతిరోజూ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేతలు పలువురు ఉన్నారు. ఇది పార్టీశ్రేణులకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో పీసీసీలో బాధ్యతలు నిర్వర్తిస్తూ జగన్‌వైపు వెళ్లిన వారి వివరాలను జిల్లాలవారీగా ఇవ్వాలని డీఎస్‌ను మొయిలీ కోరారు. దీంతో, సమాచార సేకరణలో పీసీసీ నిమగ్నమైంది. రాష్ట్రంలో నిలిచిపోయిన సంస్థాగత ఎన్నికలపైనా పీసీసీ దృష్టిసారించింది. జగన్ ప్రభావం పార్టీలో లేనందున ఈ ప్రక్రియను కొనసాగించేందుకు పీసీసీ సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మంగళవారం డీఎస్ సంస్థాగత ఎన్నికల అంశాన్ని ప్రస్తావించడంలో ప్రధాన ఉద్దేశం ఇదేనని పార్టీనేతలు అంటున్నారు.












Click it and Unblock the Notifications