చంద్రబాబు గుండెల్లో గుబులు రేపిన నాగం జనార్దన్ రెడ్డి

Nagam Janardhan Reddy and Chandra Babu
హైదరాబాద్: తన సంచలనమైన ప్రకటన ద్వారా తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి కలకలం రేపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గుండెల్లో గుబులు రేపారు. తమ తెలుగుదేశం పార్టీ నిలువునా చీలిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు సంగతి ఏమిటని అడిగితే ఎవరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తాము తెలంగాణ కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల మహా ధర్నాలో ఆయన ప్రసంగిస్తూ ఈ సంచనల వ్యాఖ్యలు చేశారు. తెలంగాణపై చంద్రబాబు వైఖరితో నాగం జనార్దన్ రెడ్డి పూర్తిగా విసిగిపోయి ఉన్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నాగం జనార్దన్ రెడ్డి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

తెలంగాణపై దూకుడుగా సాగాలని ప్రయత్నిస్తున్న నాగం జనార్దన్ రెడ్డికి ఎప్పటికప్పుడు కళ్లెం వేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల కలెక్టర్ కార్యాలయాల ముందు నాగం జనార్దన్ రెడ్డి ధర్నా కార్యక్రమాన్ని తలపెడితే చంద్రబాబు దాన్ని రద్దు చేయించారు. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులను కొందరిని చంద్రబాబు నాగం జనార్దన్ రెడ్డిని కట్టడి చేయడానికి వాడుకుంటున్నారనే అభిప్రాయం కూడా ఉంది. ఇటీవల శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు జనార్దన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ స్థితిలో కూడా నాగం జనార్దన్ రెడ్డి బుధవారం తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంఘటన ఏ మలుపు తీసుకుంటుందో చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+