చిరుది ఎన్నికల ఎజెండా, జగన్‌ది ప్రజా సమస్యల ఎజెండా: అంబటి

Ambati Rambabu
గుంటూరు/కర్నులు: చిరంజీవి పార్టీ పెట్టి ఎన్నికల కోసం చూశారని, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం పార్టీ పెట్టకముందే ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్నారని జగన్ వర్గం నేత అంబటి రాంబాబు బుధవారం గుంటూరులో చెప్పారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని భక్షించాలని చూస్తుందన్నారు. గత సాధారణ ఎన్నికలలో మూడో స్థానానికి పడిపోయిన చిరంజీవితో కాంగ్రెసు ఎలా బలపడుతుందని అధిష్టానం భావిస్తుందని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్సుమెంటుపై జగన్ చేస్తున్న దీక్షకు భారీగా విద్యార్థులు తరలి వస్తారని చెప్పారు.

కాంగ్రెసు ఎంతమందిని కలుపుకున్నా అది బలపడదని, అలాగే జగన్‌నుండి ఎంత మందిని చీల్చినా ఆయన బలహీనపడరని చెప్పారు. దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని దివంగత ఇందిరాగాంధీ శవం పక్కన ఉన్నప్పుడే ప్రధానమంత్రిగా చేశారని అది ఎవరికీ గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. కాగా కడప పార్లమెంటుకు, పులివెందుల శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ పోటీ చేసినా కనీసం డిపాజిట్లు కూడా దక్కవని మాజీ మంత్రి మారెప్ప కర్నూలులో
విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+