కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారం రోజుల పాటు దీక్ష చేస్తా, కనువిప్పు కోసమే: వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: ఒక రోజు నిరాహారదీక్షతో ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలుగదని మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన రెడ్డి అన్నారు. వారం రోజులపాటు దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు ఆయన అన్నారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో బుధవారం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఫీజు రీయింబర్స్'మెంటు కోసం హైదరాబాద్'లో ఈ నెల 18 నుంచి ఏడు రోజుల పాటు నిరాహారదీక్ష చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

ఫీజు రీయింబర్స్‌మెంటుపై సుప్రీం కోర్టు మొట్టికాయవేసినా సిగ్గులేదా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం దివంగత డాక్టర్ వైఎస్ కలలను నాశనం చేస్తోందని ఆయన బాధపడ్డారు. పేదరికం పోవాలంటే ప్రతిపేదవాడు విద్యావంతుడు కావాలన్నారు. అందుకోసం ఫీజురీయింబర్స్‌మెంటు బకాయిలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీజులు చెల్లించే విధంగా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని జగన్ దేవుడిని ప్రార్థించారు.

English summary
Ex MP YS Jagan extended his deeksha for one week demanding CM Kiran Kumar Reddy Government release of fee reimbursement amount. He is to begin his deeksha on February 18.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X