శాసనసభలో దాడిపై విచారం వ్యక్తం చేస్తున్నా: షకీల్ అహ్మద్
State
oi-Srinivas G
By Srinivas
|
న్యూఢిల్లీ: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గురువారం టిఆర్ఎస్, టిడిపి పార్టీల దాడిని ఏఐసిసి అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ తీవ్రంగా ఖండించారు. గవర్నర్ నరసింహన్ మాట్లాడుతుండగా ప్రతులను చించివేయడం, మీడియా పాయింట్ వద్ద లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణపై దాడి చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇలా దాడి చేయడం దురదృష్టకరమన్నారు. సభలో ప్రతి ఒక్కరికి తమ తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉందన్నారు. వ్యక్తి హక్కులను కాలరాచే హక్కు ఎవరికీ లేదన్నారు.
స్వతంత్ర భారతదేశంలో వ్యక్తులకు అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉందని, అయితే హింసకు పాల్పడే హక్కు మాత్రం లేదన్నారు. ఎమ్మెల్యేలు దాడి చేయడంపట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. ఎవరూ హింసకు పాల్పడవద్దని సూచించారు.
AICC spokes person Shakeel Ahmed condemned TRS and TDP attack on Governor and JP. He said it was unfortunate. He said every one has right to expess his thoughts.
Story first published: Friday, February 18, 2011, 16:58 [IST]