హైదరాబాద్: తెలంగాణపై వ్యతిరేకత ప్రదర్శిస్తున్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను వెంటనే రీకాల్ చేయాలని ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. గవర్నర్‌ను రీకాల్ చేయాలని అధిష్టానం దగ్గరకు ఓ బృందం వెళతామని ఆయన చెప్పారు. గవర్నర్ తీరు సరిగా లేదన్నారు. ఆయన ప్రవర్తనపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కేంద్రం దృష్టికి ఈ అంశాన్ని తప్పకుండా తీసుకు వెళ్లాల్సి ఉందన్నారు.
అయితే శాసనసభలో జరిగిన దానిని మేం సమర్థించడం లేదన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం, లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణపై దాడి విషయాన్ని ఖండిస్తున్నామన్నారు. అయితే ఆ దాడి ఎందుకు జరిగిందో ఆలోచించాలని సూచించారు. అలాంటి సంఘటన జరగడానికి గల కారణాలు ఏమిటో ఆలోచించాలన్నారు. తెలంగాణ బంద్‌కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందన్నారు. ప్రజలంతా బంద్‌కు సహకరించాలని కోరారు.
MLC Yadava Reddy demanded today that Governor Narasimhan recall. He accused governor's speech in assembly.
He said we urged High Command for governor recall.
Story first published: Sunday, February 20, 2011, 14:36 [IST]