24వ తేదీ వరకు ప్రభుత్వానికి గడువు ఇచ్చిన తెలంగాణ ఉద్యోగులు

తెలంగాణ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేకపోతే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ ప్రతినిధులను ఢిల్లీ తీసుకుని వెళ్లాలని, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌తోనూ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతోనూ భేటీ ఏర్పాటు చేయాలని కోరామని, ఇందుకు ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఇచ్చామని, అయితే సహాయ నిరాకరణ ఉద్యమం మాత్రం ఆపబోమని ఆయన చెప్పారు. హైదరాబాద్ ఫ్రీజోన్ అంశంపై రాష్ట్రపతి ఆమోద ముద్ర కావాలని, 610 జీవోకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, తెలంగాణ ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications