వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై లోకసభలో కెసిఆర్ వ్యూహం ఏమిటి?

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao and Sushma
న్యూఢిల్లీ‌: తెలంగాణ అంశంపై రేపు బుధవారం లోకసభలో అనుసరించబోయే వ్యూహం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణపై చర్చకు ప్రతిపాదించిన వాయిదా తీర్మానంపై స్పీకర్ మీరా కుమార్ బుధవారం చర్చకు అనుమతి ఇచ్చారు. దీంతో తనకు మద్దతు కూడగట్టుకోవడానికి ఆయన ఢిల్లీలో ఇతర పార్టీల నాయకులను కలవడంలో బిజీగా ఉన్నారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) భాగస్వామ్య పార్టీల నాయకులను ఆయన మంగళవారం సాయంత్రం కలిశారు. బిజెపి నాయకురాలు సుష్మా స్వరాజ్‌ను ఆయన కలిశారు.

కెసిఆర్ వాయిదా తీర్మానానికి మద్దతిస్తామని బిజెపి నాయకుడు ప్రకాష్ జవదేకర్ ఇప్పటికే ప్రకటించారు. కాగా, బిజెపి కూడా రేపు తెలంగాణపై ఓ తీర్మానాన్ని ప్రతిపాదించబోతోంది. రెండు తీర్మానాలపై ఎన్‌డిఎ పక్షాలు కలిసికట్టుగా వ్యవహరించడానికి అనువైన వ్యూహం రూపొందుతున్నట్లు సమాచారం.

తనకు మద్దతు ఇవ్వాలని కెసిఆర్ సిపిఐ నాయకుడు గురుదాస్ దాస్ గుప్తాను కూడా కలిశారు. అయితే, కెసిఆర్ తీర్మానానికి తాము ఎందుకు మద్దతివ్వాలని సిపిఐ నాయకుడు డి. రాజా ఇప్పటికే ప్రశ్నించారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే తాము మద్దతిస్తామని ఆయన చెప్పారు. కెసిఆర్ జెడి(యు) నేత శరద్ యాదవ్‌తో కూడా భేటీ అయ్యారు.

శరద్ యాదవ్ కెసిఆర్‌కు మద్దతిస్తామని హామీ ఇచ్చారు. కాగా, రేపు వాయిదా తీర్మానంపై ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా ప్రతిస్పందించకపోతే స్పీకర్ పోడియం వద్ద బైఠాయిస్తానని కెసిఆర్ చెప్పారు. ఆయనతో పాటు తెరాస పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి కూడా పోడియం వద్ద బైఠాయించే అవకాశాలున్నాయి. మొత్తం మీద, ప్రభుత్వ ఎజెండాలోకి తెలంగాణ అంశాన్ని తెచ్చేందుకు కెసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.

English summary
TRS president K Chandrasekhar Rao busy in meeting leaders of NDA partners. He urged the leaders to support him in 
 
 Loksabha during Telangana issue will come to debate. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X