అసెంబ్లీ వాయిదా పడినా సభలోనే బైఠాయించిన తెరాస ఎమ్మెల్యేలు

బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. అయితే, తెలంగాణ తీర్మానం ప్రతిపాదించాల్సిందేనంటూ తెరాస సభ్యులు పట్టుబట్టారు. తెలంగాణ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంలోకి వెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో సభను డిప్యూటీ స్పీకర్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.
సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. తెరాస శాసనసభ్యులు తెలంగాణ నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎంతగా సర్గి చెప్పినా వారు వినలేదు. దీంతో ఆయన సభను మరోసారి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications