ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసుతో వైయస్ జగన్ వర్గం అవగాహన

వచ్చే నెలలో స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటా కింద జరగాల్సిన ఎన్నికలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌లదృష్టిసారించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల నుంచి గెలుపు గుర్రాలను ఎంపిక చేసే విషయంలో మల్ల గుల్లాలు పడుతున్నారు. వీరిద్దరూ మంగళవారం అసెంబ్లీలో వివిధ జిల్లాల నేతలతో మంతనాలు జరిపారు. కొన్ని చోట్ల జగన్ వర్గం అభ్యర్థులు రంగంలో ఉంటే ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడం ఎలా అన్న అంశాన్ని సీఎం, డీఎస్‌లు చర్చించారు. ప్రధానంగా ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహరచన చేస్తోంది. స్థానిక సంస్థల నుంచి పది స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
కర్నూలు జిల్లా నుంచి గంగుల ప్రభాకరరెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించారు. ఈ జిల్లాలో ప్రజారాజ్యం శాసనసభ్యులుభూమా శోభానాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డి జగన్ శిబిరంలో ఉన్నారు. దీంతో జగన్ వర్గం నుంచి అభ్యర్థిని నిలిపే విషయమై మంతనాలు సాగుతున్నాయి. కడపజిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ఆధిక్యత ఉన్నా కొంతమంది జగన్ వైపు మొగ్గడంతో అక్కడ పోటాపోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థికోసం అన్వేషిస్తోంది. గెలుస్తామనే ధీమాతో ఉన్న జగన్ వర్గం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరుడు నారాయణరెడ్డి లేదా మాజీ ఎమ్మెల్యే గోవిందరెడ్డిలలో ఒకరిని అభ్యర్థిగా నిలిపే అవకాశముందని భావిస్తున్నారు.
శ్రీకాకుళం, తూర్పుగోదావరి, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, హైదరాబాద్ జిల్లాలనుంచి ఒక్కొక్కరి చొప్పున, పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరిని ఎమ్మెల్సీలుగా ఎన్నుకోవాల్సి ఉంది. ఇప్పుడు పదవీవిరమణ చేస్తున్న వారిలో ఒకరు టిడిపి, ఒకరు మజ్లిస్‌కు చెందినవారు కాగా మిగిలినవారంతా కాంగ్రెస్‌కు చెందినవారు. నెల్లూరు, తూర్పు, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల్లో పరిస్థితిని ఆయన సమీక్షించారు.












Click it and Unblock the Notifications