హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్ర బడ్జెట్ మేడిపండులా ఉంది: టిడిపి అధినేత చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ మేడిపండులా ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. బడ్జెట్ చూస్తుంటే ప్రభుత్వానికి ప్రణాళికా, ముందుచూపు కొరవడినట్లుగా కనిపిస్తోందన్నారు. సంక్షేమ పథకాలకు గత ఏడాదితో పోలిస్తే కేటాయింపుల్లో రెండుశాతం తగ్గిందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో వాస్తవాలకు అంచనాలకు పోలికే లేదన్నారు. బడ్జెట్ ద్వారా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందన్నారు. ఇది పద్ధతి లేని బడ్జెట్ అన్నారు. ఈ రంగానికి సరిగా కేటాయింపులు లేవన్నారు. విద్యుత్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్‌ను ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏడు గంటలు మాత్రమే ఇస్తామని చెబుతోందని, అది కూడా సరిగా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇప్పుడు పగటి పూట రెండు గంటలు మాత్రమే ఇస్తుందన్నారు. నగరంలో రోజుకు పదిసార్లు కరెంటు పోతోందన్నారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యుత్ ఇస్తామని హామీ ఇవ్వడం కాదని, క్వాలిటీ విద్యుత్ ఇవ్వడం కావాలన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం చాలా వెనుక బడి ఉందన్నారు.కిలో బియ్యం 2 రూపాయలకు ఇస్తామని చెప్పారు, కానీ ఎంత ఇస్తున్నారు, ఎలాంటి బియ్యం ఇస్తున్నారో గుర్తుంచుకోవాలన్నారు. కందిపప్పు ఎవరికి ఇస్తున్నారో కూడా తెలియదన్నారు. ఆహార భద్రతకు, శాంతి భద్రతల సమస్యలపై ఊసే లేదన్నారు. అవినీతి గురించి కూడా ప్రస్తావించలేదన్నారు. వ్యవసాయం తర్వాత ఎక్కువమంది ఆధారపడిన పరిశ్రమ చేనేత అని, అయితే దానిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు.

బడ్జెట్‌లో చేనేత గురించి ప్రస్తావనే లేక పోవడం శోచనీయమన్నారు. జలయజ్ఞాన్ని రాష్ట్రానికి గుదిబండలా తయారు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఇదివరకే చెప్పిందన్నారు. ఇప్పుడు పరిస్థితి అలాగే తయారయిందన్నారు. ఐటి వల్ల లాభాలు వస్తున్నాయని గొప్పగా చెప్పుకుంటున్నారని, అయితే ఆ ఐటిని అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే అని గుర్తుంచుకోవాలన్నారు. లాభం వస్తుందన్న ఐటికి మాత్రం ప్రభుత్వం కేటాయింపులు సరిగా లేవన్నారు. విద్యార్థులకు ఫీజులు ఎలా చెల్లిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఆర్థిక సంస్కరణలు తీసుకు వచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే అన్నారు.

English summary
TDP president Chandrababu Naidu opposed state budget proposed by financial minister Aanam Ramanarayana Reddy. He said government is neglecting welfare section.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X