అసెంబ్లీకి నల్లబ్యాడ్జీలతో వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేల పాదయాత్ర

YS Jagan
హైదరాబాద్‌: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు బుధవారం శాసనసభకు పాదయాత్ర చేపట్టారు. ఫీజుల రీయంబర్స్‌మెంట్ చెల్లింపులపై ప్రభుత్వ నిర్లక్ష వైఖరికి నిరసనగా వారు ఈ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో తెలుగుదేశం అసమ్మతి శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో పాటు కాంగ్రెసు శాసనసభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాస రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, కొండా సురేఖ, కుంజా సత్యవతి, కమలమ్మ, అమర్నాథ్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, కాపు రామచంద్రా రెడ్డి, ప్రసాద రాజు, శ్రీకాంత్ రెడ్డి,త బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజారాజ్యం శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.

ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదలకు డిమాండ్ చేస్తూ హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన వైయస్ జగన్ దీక్ష బుధవారానికి ఆరో రోజుకు చేరుకుంది. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పాల్పడుతోందని జగన్ వర్గం శాసనసభ్యులు విమర్శించారు. వైయస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. ప్రభుత్వానికి తన నిరసనను తెలిపేందుకే నల్లబ్యాడ్జీలు ధరించి పాదయాత్ర చేపట్టామని వారు చెప్పారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే 24వ తేదీన విద్యార్థులతో సహా తాము శాసనసభను ముట్టడిస్తామని వారు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+