తెలంగాణ ఎంపీలకు కావూరి సాంబశివ రావు కౌంటర్ వ్యూహం

శ్రీకృష్ణ కమిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చినందున కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు ఆలోచించకూడదన్న అభిప్రాయం వ్యక్తమైంది. పార్టీ పెద్దలందరినీ కలిసి ఇదే విషయాన్ని చెప్పాలని, ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తేవాలని ఎంపీలు నిర్ణయించారు. వచ్చే ఒకటి రెండు రోజుల్లో ఈ పనిని పూర్తిచేస్తారని తెలుస్తోంది. సమావేశం అనంతరం ఎంపీ కావూరి సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీకృష్ణ కమిటీ నిజాయితీగా ఇచ్చిన నివేదికను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సముచితమైన నిర్ణయం తీసుకోవాలని, దీనిపై జాప్యం తగదని అన్నారు.
ఆలస్యమైతే రాష్ట్రానికీ, ప్రజలకూ నష్టం జరుగుతుందని అన్నారు. జాప్యం వల్ల అన్నదమ్ముల్లా ఉన్న ప్రజల మధ్య విభేదాలు పెరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు. ప్రధాని, ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్‌లను కలిసి విషయాన్ని వివరిస్తామని శ్రీకృష్ణ కమిటీ నివేదిక నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే సముచిత నిర్ణయానికి తమ ఆమోదం ఉంటుందని ఆయన అన్నారు. సమావేశానికి 13 మంది ఎంపీలు హాజరయ్యారని, రానివాళ్లు ఫోన్ చేసి మాట్లాడారని, అందరూ ఒకే అభిప్రాయంతో ఉన్నారని తెలిపారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications