హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై శాసనసభ్యుల ఏకాభిప్రాయం తర్వాతే తీర్మానం: శ్రీధర్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Sridhar Babu
హైదరాబాద్ :తెలంగాణ అంశంపై శాసనసభ్యులందరూ కలిసి ఒక ఏకాభిప్రాయానికి వస్తేనే.. ప్రభుత్వం శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెడుతుందని శాసనసభ వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. తెలంగాణా అంశంపై ఇతర పార్టీల అజెండాల ఆధారంగా అధికార పార్టీ నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు.

తెలంగాణా అంశంపై అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సదరు పార్టీలతో గతంలోనే చర్చలు జరిపిందని, తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రతి విషయాన్ని కేంద్ర అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే తెలంగాణా అంశానికి కేంద్రం ఖచ్చితంగా ఓ పరిష్కారాన్ని సూచిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేసారు.

తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని ప్రస్తుత పరిస్థితిలో సభ్యులు నడుమ ఏకాభిప్రాయం రాదని తెలిసి కూడా ఈ అంశంపై తీర్మానం పెట్టడం సరికాదని ఆయన అన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమం వల్ల తెలంగాణాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ ఉద్యమం ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి పరీక్షలు హాజరయ్యే విద్యార్థులపై కూడా దీని ప్రభావం పడనుందని ఆయన అన్నారు.

English summary
Appealing to all the Opposition parties to help run the House, the Civil Supplies and Legislature Affairs Minister, Mr D. 
 
 Sridhar Babu, made it clear that the government would move a resolution in the House after evolving consensus on the 
 
 Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X