శాసనసభను అడ్డుకుంటే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తాం: మల్లుభట్టి

ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేశామని, అందుకు అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని కోరినప్పటికీ కొన్ని పార్టీలు పనిగట్టుకుని కావాలనే సమావేశాల్ని అడ్డుకుంటున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. ప్రజా ప్రతినిధులగా ఎన్నికై వచ్చిన ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై చర్చించాలిగాని, ఇలా దుర్వినియోగం చేయడం తగదని అన్నారు.
సమావేశాల సందర్భంగా ఎంత డబ్బు వృధా అవుతుందో ఆలోచించాలని, ఇదంతా ప్రజల సొమ్మేనని ఆయన గుర్తు చేశారు. శాసనసభలో తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపిస్తామని చెప్పినవారు సమావేశాలను అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications