అద్వానీపై చంద్రబాబు వ్యాఖ్య, బిజెపి నేత కిషన్ రెడ్డి ధ్వజం

తెలుగుదేశం పార్టీ తెలంగాణపై సబ్ కమిటీ వేసి అధ్యయనం చేసి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించిందని, ఆ తర్వాత తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి నివేదిక ఇచ్చారని, పార్టీ మహానాడులో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేశారని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు పెట్టుకున్నారని, ఇంత చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని కేంద్రం చెప్పగానే యూ టర్న్ తీసుకున్నారని ఆయన వివరించారు. తెలంగాణపై చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు తెలంగాణకు అనుకూలమా, కాదా చెప్పాలని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. పదో తరగతి పరీక్షలకు ఆటంకం కలగకుండా చూస్తామని, దీనిపై తెలంగాణ జెఎసితో మాట్లాడుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications