అసెంబ్లీలో తెలంగాణ కరపత్రాల గొడవ: సీమాంధ్రులకు పంచిన కెఎల్ఆర్

Assembly
హైదరాబాద్: పార్లమెంటులో సమైక్యాంధ్ర కరపత్రాల మాదిరి అసెంబ్లీలో కూడా కరపత్రాలను పంచారు. మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి(కెఎల్ఆర్) తెలంగాణకు అనుకూలంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలకు కరపత్రాలు పంచారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల పేరున ఆ కరపత్రాలు పంచారు. ప్రత్యేక తెలంగాణకు సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఒప్పుకోవాలని ఆయన అందులో కోరారు. అన్నదమ్ముల్లా విడిపోదాం, ఆత్మీయుల్లా కలిసి ఉందాం అని ఆ కరపత్రంలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతానికి వివాద బిందువు అయిన హైదరాబాద్‌పైన చర్చించుకుందామని ఆయన ఎమ్మెల్యేలను కోరారు.

ఆ కరపత్రంలో ఆయన సీమాంధ్రులకు హైదరాబాద్‌పైన రెండు ఆప్షన్స్ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాదా లేకా రెవెన్యూ హైదరాబాదా అని, రెండోది తాత్కాలిక కేంద్ర పాలిత ప్రాంతమా, ఉమ్మడి రాజధానియా చర్చించుకుందామని సూచించారు. మనుషులమే విడిపోతున్నాం కానీ, మనసుల విభజన కాదని కెఎల్ఆర్ ఆ కరపత్రంలో పేర్కొన్నారు. పరిపాలనా విభజనను ప్రజలంతా కోరుకుంటున్నారని ఆయన సూచించారు. హైదరాబాద్‌పై అందరూ ముందుకు వస్తే చర్చించుకుందామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+