వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆహార ద్రవ్యోల్బణం ఆందోళనకరంగా ఉంది: బడ్జెట్ ప్రసంగంలో ప్రణబ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
న్యూఢిల్లీ: ఆహార ద్రవ్యోల్బణం ఆందోళనకరంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. దేశ అవసరాలకు అనుగుణంగా ఆహార ధాన్యాల దిగుబడిని పెంచాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారం పార్లమెంటులో 2011-12 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రతిపాదించారు. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ అన్ని రంగాల్లో సవాళ్లను అధిగమించిందని ఆయన చెప్పారు. గత కొద్ది రోజులుగా తగ్గుతున్న ధరలు ఊరట కలిగిస్తున్నాయని ఆయన చెప్పారు. మరింత పారదర్శకంగా ముందుకు సాగేలా బడ్జెట్ ఉంటుందని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగం చెప్పుకోదగ్గ స్థాయిలో పుంజుకుందని ఆయన చెప్పారు. పారిశ్రామిక రంగం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని ఆయన చెప్పారు.

అవినీతిపై ఉమ్మడి పోరాటం అవసరమని ఆయన చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా ఆర్థికాభివృద్ధి ఉంటుందని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సమీకృత నిధి అవసరమని ఆయన చెప్పారు. బడ్జెట్ పారదర్శక ఆర్థిక విధానానికి నాందిగా ఉంటుందని ఆయన చెప్పారు. నిరుడు 17.6 శాతం ఎగుమతులు పెరిగాయని ఆయన చెప్పారు. వృద్ధి రేటు పెరుగుదలకు కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని ఆయన చెప్పారు. అవసరాలు, పంపిణీ మధ్య సమతుల్యత సాధిస్తామని ఆయన చెప్పారు. సబ్సిడీ కిరోసిన్ తప్పుదారి పడుతోందని ఆయన అన్నారు.

English summary
Finance Minister Pranab Mukherjee said that food inflation as a concern. He said that food grains production should be according to the needs of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X