శ్రీకాకుళం జిల్లాలో ఆందోళన, పోలీసు కాల్పుల్లో ఇద్దరు మృతి

ప్లాంట్ వైపు దూసుకొస్తున్న ప్రజలను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. అయినా ప్రజలు వెనక్కి తగ్గలేదు. దీంతో పోలీసులు ఆందోళనకారులపైకి రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. పోలీసులు ప్రయోగించిన బుల్లెట్లకు దాదాపు 155 గుడిసెలు దగ్ధమయ్యాయి. మంటలు ఇంకా వ్యాపిస్తూనే ఉన్నాయి. పోలీసుల చర్యను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో సహా ప్రతిపక్షాల నాయకులు తీవ్రంగా తప్పు పట్టారు. ప్లాంట్ నిర్మాణాన్ని అడ్డుకుని తీరుతామని ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు. ప్రజలను ఒప్పించకుండా ప్లాంట్‌ను నిర్మించడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు.












Click it and Unblock the Notifications