హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ వివేకానంద రెడ్డికి తెలంగాణ సెగ, విద్యార్థుల బెఠాయింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vivekananda Reddy
హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డికి తెలంగాణ సెగ తగిలింది. ఓ పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా మంత్రిని తెలంగాణ విద్యార్థులు అడ్డుకున్నారు. మంత్రి కారుపై దాడి చేశారు. ఈ దాడిలో కారు ధ్వంసమైంది. కొద్ది మంది గాయపడ్డారు. మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. దాడికి దిగిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. విద్యార్థుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు ఎ. చంద్రశేఖర్ విమర్శించారు. లాఠీచార్జీకి దిగిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

పోలీసుల చర్యకు నిరసనగా విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. విద్యార్థులకు మద్దతుగా చంద్రశేఖర్ కూడా రోడ్డుపై బైఠాయించారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తారంటూ విద్యార్థులు వైయస్ వివేకానంద రెడ్డిని అడ్డుకున్నారు. మహిళలపై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వస్తున్నాయి. మంత్రిని శాంతియుతంగానే అడ్డుకున్నారని తెలంగాణవాదులు అంటున్నారు.

English summary
Telangana students attacked Minister YS Vivekananda Reddy, who belongs to Rayalaseema. They obstructed YS Vivekananda Reddy's convoy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X