ఎమ్మెల్సీగా రామచంద్రయ్య, రాజ్యసభకు అల్లు అరవింద్‌కు లైన్ క్లియర్

అయితే, రామచంద్రయ్య రాజ్యసభకు వెళ్లడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఎమ్మెల్సీగా వెళ్లడానికి ఆయన ఇష్టపడతారా, లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనను ఒప్పించేందుకు చిరంజీవి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ విలీనం తర్వాత చిరంజీవిని రాజ్యసభకు ఎంపిక చేస్తారనే వార్తలు వస్తున్నాయి. వేరే రాష్ట్రం నుంచి ఆయనను రాజ్యసభకు ఎన్నిక చేయడానికి ప్రయత్నాలు సాగిస్తారని చెబుతున్నారు. రాష్ట్రం నుంచి జరిగే రాజ్యసభ ఎన్నికల్లో అల్లు అరవింద్‌కు రాజ్యసభ టికెట్ లభించేలా ఏర్పాటు చేసుకోవాలని, అందుకు పార్టీ నాయకుల నుంచి పోటీ ఉండకూడదని చిరంజీవి భావిస్తున్నారట.
కాగా, గవర్నర్ కోటాలో కూడా ప్రజారాజ్యం పార్టీకి ఓ ఎమ్మెల్సీ సీటు దక్కవచ్చునని అంటున్నారు. ఈ విషయం ఇప్పటికే చిరంజీవి గవర్నర్ నరసింహన్‌తో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే, దీనికి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ ఎక్కువగానే ఉంది. కోటగిరి విద్యాధర రావు, కొత్తపల్లి సుబ్బారాయుడు, వేదవ్యాస్, తలారి మనోహర్ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications