నాది మచ్చలేని జీవితం.. మోదీ పర్యటన వేళ రాజకీయ కుట్ర..బండి సంజయ్ ఎమోషనల్

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై వచ్చిన ఆరోపణల నేపధ్యంలో సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని రాజకీయ కుట్రగా అభివర్ణించిన బండి సంజయ్, ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సమయంలో తన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో జరుగుతున్న పని అని ఆరోపించారు.

సోషల్ మీడియాలో ఎమోషనల్ ట్వీట్ చేసిన బండి సంజయ్

సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసిన బండి సంజయ్ తన జీవితం మచ్చలేనిదని స్పష్టం చేశారు. ఎప్పుడూ చట్టాన్ని గౌరవించి, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. తన ఎదుగుదలను సహించలేక కొందరు రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి కుట్ర చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.తన ప్రజా జీవితం అంతా చట్టబద్ధంగా, మచ్చలు లేకుండా గడిపానని పేర్కొన్నారు.

Bandi Sanjay strong React on Allegations Against His Son Bhageerath said it s a political conspiracy

నాపై, నా కుటుంబంపై రాజకీయ కుట్ర: బండి సంజయ్

కుటుంబ సభ్యులను, పిల్లలను రాజకీయాల్లోకి లాగడం ధైర్యం లేని వారి నిస్సహాయతను చూపిస్తోందని అన్నారు.బీసీ నేపథ్యం నుంచి కష్టపడి కార్పొరేటర్‌గా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఎదిగిన తన ప్రయాణాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ఈ క్రమంలోనే నాపై, నా కుటుంబంపై రాజకీయ కుట్రకు తెర లేపారని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని, కాలం అన్ని వాస్తవాలు బయటపెడుతుందని చెప్పారు.సత్యమేవ జయతే అని ముగించారు.


హనీ ట్రాప్‌లో పడేసి ఐదు కోట్లు బ్లాక్‌మెయిల్

అయితే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఒక కుటుంబం తనను హనీ ట్రాప్‌లో పడేసి ఐదు కోట్లు బ్లాక్‌మెయిల్ చేస్తోందని కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ యువతి కుటుంబం కూడా వ్యతిరేక ఫిర్యాదు చేసి, భగీరథ్‌పై POCSO ఆక్ట్ కింద కేసు నమోదు చేయించింది.

ఏపీ, తెలంగాణా వాసులకు పండుగే.. కొత్త రైల్వేలైన్ జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ!
ఏపీ, తెలంగాణా వాసులకు పండుగే.. కొత్త రైల్వేలైన్ జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ!

రాజకీయ ఎదుగుదలను చూడలేని వారి కుట్ర

రెండు వైపులా ఫిర్యాదులు ఉండటంతో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దీంతో నేడు మోడీ పర్యటనకు కూడా బండి సంజయ్ కు ఆహ్వానం లేదు. బండి సంజయ్ ఈ ఘటనను తన రాజకీయ ఎదుగుదలను చూడలేని వారి కుట్రగా అభివర్ణించారు. న్యాయవ్యవస్థ తగిన నిర్ణయం తీసుకుంటుందని కేంద్రమంత్రి బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+