వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భార్య ఖాతా ద్వారా విదేశాలకు ఎ రాజా లంచం డబ్బుల తరలింపు

కొన్ని టెలికం కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించడానికి రాాజ 3 వేల కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. 2జి స్కామ్ వల్ల ప్రభుత్వ ఖజానాకు 45 వేల కోట్ల నుంచి 50 వేల కోట్ల రూపాయల వరకు గండి పడిందని సిబిఐ విశ్వసిస్తోంది. టెలికం రంగంలోకి విదేశీ కరెన్సీ ప్రవహించిన తీరును, తిరిగి అది విదేశాలకు తరలి వెళ్లిన వైనాన్ని నిర్ధారించుకునేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇతర దర్యాప్తు సంస్థలు 10 దేశాల బ్యాంకులకు ఎల్ఆర్ఎస్ పంపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
2జి స్కామ్‌కు సంబంధించి సిబిఐ ఇప్పటికే సింగపూర్, మార్షియస్, సైప్రస్, దుబాయ్, మాస్కో, నార్వే, ఐస్లే ఆఫ్ మ్యాన్, జెర్సీ ఐలాండ్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్‌ల్లో దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.