రాజీనామాకు తెలంగాణ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సిద్ధం?
State
oi-Pratapreddy
By Pratap
|
న్యూఢిల్లీ: సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు వ్యాఖ్యల నేపథ్యంలో రాజీనామా చేసేందుకు కాంగ్రెసు నల్లగొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. కావూరి సాంబశివరావు రాజీనామా చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని ప్రకటించిన గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పుడు తానే రాజీనామాకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. పార్టీ అధిష్టానం కోరిక మేరకు తాము సహనంతో వ్యవహరిస్తుంటే, దాన్ని చేతగానితనంగా సీమాంధ్ర నాయకులు చిత్రీకరిస్తున్నారని ఆయన భావించి, పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయడానికి పూనుకుంటున్నట్లు తెలుస్తోంది.
రాజీనామా చేయవద్దని సహచర పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డికి సలహా ఇస్తున్నట్లు సమాచారం. అయితే, అందుకు ఆయన అంగీకరించడం లేదని చెబుతున్నారు. పదవులు వదిలి తెలంగాణ నాయకులు పది నిమిషాలు కూడా ఉండలేరని కావూరి చేసిన వ్యాఖ్య ఆయనను తీవ్ర మనస్తాపానికి గురి చేసినట్లు చెబుతున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యులు కె. చంద్రశేఖర రావు, విజయశాంతి ఢిల్లీకి చేరనున్నారు. లోకసభలో వారు అనుసరించే వ్యూహమేమిటనేది కొద్దిసేపట్లో తేలిపోనుంది.
It is learnt that Congress Telangana region MP Gutta Sukhender Reddy has prepared resign from Loksabha, protest against Kavuri Sambasiva Rao's comments. Congress Telangana MPs met to discuss about Kavuri comments.
Story first published: Thursday, March 3, 2011, 10:47 [IST]