మిలియన్ మార్చ్‌లో మార్పు లేదు, పదవ తేదీన్నే: కోదండరామ్

తెలంగాణపై పార్లమెంటు సభ్యులు ఈ రోజు ఒక గొంతుతో వినిపించారని ఆయన చెప్పారు. ఈ స్థితిలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఉన్న నేపథ్యంలో మిలియన్ మార్చ్ వాయిదా వేయాలని కొన్ని రాజకీయ పార్టీలు కోరాయి. అయితే అందుకు కోదండరామ్ అంగీకరించలేదు. ఇంటర్మీడియట్ పరీక్షను వాయిదా వేయబోమని, ఆటంకం ఏర్పడకుండా చూస్తామని మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications