మారని స్థితి: తెలంగాణపై మళ్లీ దద్దరిల్లిన లోకసభ, అద్వానీ బాసట

తెలంగాణ పార్లమెంటు సభ్యులు ప్రజల ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారని, తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకుంటున్నారని ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన స్తంభించిపోయిందని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి జీతం రాలేదని, ఓ మంత్రి రాజీనామా చేశారని, రాష్ట్రంలో పరిస్థితి విషమిస్తోందని ఆమె అన్నారు. పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదిస్తే తాము మద్దతిస్తామని ఆమె అన్నారు. ప్రజలు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాట్లాడకపోవడం సరి కాదని ఆమె అన్నారు. తెలంగాణ సభ్యులు శాంతించకపోవడంతో సభ మరోసారి వాయిదా పడింది.
తెలంగాణ పేరుతో కాంగ్రెసు ప్రజలను మోసం చేస్తోందని బిజెపి రాజ్యసభ సభ్యుడు ప్రకాష్ జవదేకర్ అన్నారు. తెలంగాణపై రాజ్యసభ సమావేశాలను బిజెపి సభ్యులు అడ్డుకున్నారు. తాము తెలంగాణపై ప్రైవేట్ సభ్యుల తీర్మానాన్ని ప్రవేశపెడుతామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాము తెలంగాణ కోసం పోరాటం చేస్తామని, రేపు కూడా రాజ్యసభలో పోరాడుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications