కావూరి దుమారం: తెలంగాణ నేతల గుర్రుతో కాంగ్రెసులో చిచ్చు

జూపల్లి రాజీనామా నేపథ్యంలో తమపై ఒత్తిడి పెరిగిందని, తెలంగాణకు అనుకూలంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ మంత్రులు కాంగ్రెసు అధిష్టానాన్ని కోరే అవకాశం ఉంది. జూపల్లి రాజీనామా నేపథ్యంలో తెలంగాణ మంత్రులు కె. జానా రెడ్డి చేంబర్‌లో సమావేశమయ్యారు. సోనియా అపాయింట్‌మెంట్ కోసం ఇప్పటికే వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కావూరి సాంబశివరావుతో పాటు మరో సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు చేసిన వ్యాఖ్యలు కూడా తెలంగాణ రాజకీయ నాయకుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కాగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు సమావేశమయ్యారు. కావూరి సాంబశివరావు వ్యాఖ్యలపై వారు చర్చిస్తున్నారు. కావూరి వ్యాఖ్యల నేపథ్యంలో తమ భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు.












Click it and Unblock the Notifications