హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరీక్షల వాయిదా లేదు, తెలంగాణ విద్యార్థులకు నష్టం: శ్రీధర్‌ బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sridhar Babu
హైదరాబాద్: మార్చి 7వ తేదినుండి ప్రారంభమవుతున్న ఇంటర్మిడియేట్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేయడం లేదని మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం స్పష్టం చేశారు. ఉద్యమాల వల్ల తెలంగాణ ప్రాంతం విద్యార్థులకే నష్టమన్నారు. తెలంగాణ కోసం అన్ని పార్టీల నేతలు వారి వారి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు తుది రూపు తీసుకు వచ్చేందుకు అందరూ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మార్చి 10న ఉన్న పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నారు. కానీ జాతీయస్థాయి పరీక్షలు ఉన్నాయన్నారు. ఇక్కడ మనం వాయిదా వేసినా జాతీయస్థాయి పరీక్షలు వాయిదా పడవని సూచించారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అందరూ పరీక్షలకు సహకరించాలని కోరారు. మిలియన్ మార్చ్‌ కారణంగా తెలంగాణ విద్యార్థులకే నష్టమని చెప్పారు. పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తి లేదని చెప్పారు. అందరూ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాలని సూచించారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానంపై మాకు నమ్మకం ఉందన్నారు. నాయకత్వంపై నమ్మకంతోనే ముందుకు వెళుతున్నామని చెప్పారు. కేంద్రం తెలంగాణపై ఇంకా తుది తీర్పు ఇవ్వలేదని చెప్పారు.

English summary
Minister Sridhar Babu confirmed that the intermediate exams will not postpone. He said Telangana student will loose with agitations. He urged Telanganites to don't disturb exams.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X