ఫీజు కట్టలేక పటాన్‌చెరులో బిటెక్ విద్యార్థి ఆత్మహత్య
Districts
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్స్ కారణంగా మరో విద్యార్థి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు సమీపంలోని ఐనోలు ప్రాంతానికి చెందిన శంకర్‌రెడ్డి అనే విద్యార్థి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. శంకర్‌రెడ్డి సిఆర్ఆర్ కళాశాలలో చదువుతున్నాడు. ఫీజు కట్టలేకపోవడంతోనే శంకర్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. శంకర్‌రెడ్డి తల్లిదండ్రులు కూడా తాము తన కొడుకు ఫీజు కట్టలేక పోవడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు.
కాగా ఆత్మహత్యకు పాల్పడిన శంకర్‌రెడ్డి ఆసుపత్రికి తరలించారు. కాగా ఇటీవలే వరలక్ష్మి అనే ఓ విద్యార్థిని ఫీజు కట్టలేక మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె ఓ వాచ్‌మెన్ కూతురు.