చంద్రబాబు పార్టీ రెండు ముక్కలయింది, మొసలి కన్నీరు: జగన్

థర్మల్ ప్రాజెక్టు తన తండ్రి అయిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే వచ్చిందని చెప్పారు. అయితే అప్పుడు ప్రాజెక్టును ప్రజలు వ్యతిరేకించలేదన్నారు. ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు కాబట్టే ప్రజలకు మద్దతుగా వచ్చానని అన్నారు. తాను ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని అయితే ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధంగా మాత్రం ఉండకూడదని అన్నారు. కాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూ తాను జగన్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ నెల 11న జగన్ బహిరంగ సభ జిల్లాలో ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications