హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ పార్టీలో 100 మంది దాకా ఎమ్మెల్యేలు: అంబటి రాంబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఇప్పటికీ సుమారు వందమంది శాసనసభ్యులు టచ్‌లో ఉన్నారని జగన్ వర్గం నేత అంబటి రాంబాబు మంగళవారం అన్నారు. జగన్ పార్టీ పెడితే 156 శాసనసభ్యుల్లో సుమారు వంద మంది జగన్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సొంత పార్టీ వారినుండే సహకారం లేదన్నారు. సుమారు 12మంది ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఫిర్యాదు చేశారని అన్నారు. జగన్ పార్టీ పెట్టాక గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వంటి వారు టిక్కెట్ల కోసం క్యూ కడతారన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ చచ్చిపోయిన పార్టీ అన్నారు. చచ్చిపోయిన కాంగ్రెసు‌ను రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌గా రానున్న గులాం నబీ ఆజాద్ కూడా బతికించలేరన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మరణంపై రాష్ట్ర ప్రజలకు అనుమానాలు ఉన్నాయన్నారు. వైయస్ మృతి అనంతరం ఇప్పుడు జగన్‌కు కూడా భద్రత తగ్గించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. జగన్ ఏఐసిసి అధ్యక్షురాలో సోనియాగాంధీతో విభేదించినప్పటినుండి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రాజెక్టుకు వైయస్ అనుమతిచ్చారని అన్నారు. ఆయన బతికి ఉంటే బాధితులను ఒప్పించడమో లేదా ప్రాజెక్టు ఒప్పందాన్ని రద్దు చేయడమో చేసే వారు అన్నారు.

జగన్ కాంగ్రెసు పార్టీతో వెళ్లే ప్రసక్తి లేదన్నారు. జగన్ ఖచ్చితంగా పార్టీ పెడతారని చెప్పారు. అయితే దానిపై ఇప్పుడే ఖచ్చితమైన తేదిని ప్రకటించలేమని చెప్పారు. మార్చి 7వ తేదిన జగన్ పార్టీ అనేది మీడియా సృష్టే అన్నారు.

English summary
Ex MP YS Jaganmohan Reddy camp senior leader Ambati Rambabu said today that nearly 100 MLAs are in touch with Jagan. He accused for reducing Jagan's security. He said Congress state in charge Gulam Nabi Azad will not save party in state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X