ప్రజలే మాకు పాస్ మార్కులు వేస్తారు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్

గతంలో భూకేటాయింపులలో జరిగిన అక్రమాలపై తప్పు సమీక్షిస్తానని ముఖ్యమంత్రి చెప్పడం అభినందనీయమని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. ప్రజా ప్రయోజనాలు పక్కన పెట్టి బిడ్డింగుల్లో మార్పులు చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. పోర్టులు అవినీతి నిలయంగా మారుతున్నాయన్నారు. భూ కేటాయింపులపై అన్ని విధానాలు బహిరంగ పర్చాలని డిమాండ్ చేశారు. పోర్టు కోసం కేంద్రం అడిగిన చోట స్థలాన్ని కేటాయించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. పోర్టుకు కేటాయించిన భూములు తాకట్టు పెట్టుకునే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. తీరప్రాంతంలో కిలోమీటర్ల కొద్ది స్థలం కేటాయించవద్దని కేంద్రం చెప్పిందని అన్నారు.
కాగా రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రభుత్వం కొత్త పోకడలకు అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కాగా పోర్టుల నిర్ణయాలపై శాసనసభా కమిటీని వేయాలని ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే కన్నబాబు, టిడిపి నేత గాలిముద్దుకృష్ణమ నాయుడు అన్నారు.












Click it and Unblock the Notifications